సెంచరీ చేజార్చుకున్న బెయిర్ స్టో... భారీస్కోరు దిశగా ఇంగ్లాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెంచరీ చేజార్చుకున్న బెయిర్ స్టో... భారీస్కోరు దిశగా ఇంగ్లాండ్

  • 31 ఓవర్లలో ఇంగ్లాండ్ 2 వికెట్లకు 168
  • రాణించిన రూట్
  • ఆఫ్ఘనిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్
ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో సెంచరీ చేజార్చుకున్నాడు. బెయిర్ స్టో 99 బంతుల్లో 90 పరుగులు చేసి నాయబ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. బెయిర్ స్టో స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. మరో ఓపెనర్ జేమ్స్ విన్స్ 26 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 48, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 7 పరుగులతో ఆడుతున్నారు. 31 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 2 వికెట్లకు 168 పరుగులు. మాంచెస్టర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
Cricket
England
Afghanistan

More Telugu News