పాకిస్థాన్ నటి వీణా మాలిక్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సానియా మీర్జా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ నటి వీణా మాలిక్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సానియా మీర్జా

  • కొడుకుని హుక్కా బార్ కు తీసుకెళ్లడం దారుణమన్న వీణా మాలిక్
  • నా కొడుకుని ఎక్కడకూ తీసుకెళ్లలేదన్న సానియా
  • ఈ విషయాలన్నీ మీకు అనవసరమంటూ వ్యాఖ్య
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పాకిస్థాన్ నటి వీణా మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన భర్త షోయబ్ మాలిక్, కుమారుడు ఇజాన్ లతో పాటు ఇతర పాక్ క్రికెటర్లతో పాటు సానియా గతంలో హుక్కా బార్ కు వెళ్లింది. ఆ సందర్భంగా సానియా హుక్కా తాగుతున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ విషయాన్ని సానియాకు ట్యాగ్ చేస్తూ... 'సానియా మీ అబ్బాయిని కూడా హుక్కా బార్ కు తీసుకెళ్లడం దారుణం. అది చాలా ప్రమాదకరం. పైగా మీరు వెళ్లిన బార్ లో జంక్ ఫుడ్ అమ్ముతుంటారు. ఇలాంటి ఆహారం మీలాంటి క్రీడాకారులకు అనారోగ్యకరం. ఓ తల్లిగా ఈ విషయాలు మీకు తెలిసుండాలి' అంటూ వీణామాలిక్ కామెంట్ చేసింది.

వీణా వ్యాఖ్యలకు సానియా మీర్జా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తన కుమారుడిని తాను ఎక్కడకూ తీసుకెళ్లలేదని... అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరమని చెప్పింది. తన కుమారుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తనకు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించింది. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారో పట్టించుకోవడానికి తాను పాక్ క్రికెట్ టీమ్ డైటీషియన్ కాదని ఎద్దేవా చేసింది. వారి తల్లిని కాదని, టీచర్ ను అంతకన్నా కాదని చెప్పింది.

ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో, సానియా మీర్జాపై పాకిస్థాన్ కు చెందిన పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
veena malik
sania mirza

More Telugu News