టీడీపీ ఓటమికి ఇదే కారణం: మంత్రి అవంతి శ్రీనివాస్
- ఒంటెద్దు పోకడలే టీడీపీ ఓటమికి కారణం
- హోదాపై చంద్రబాబు చాలా సార్లు యూటర్న్ తీసుకున్నారు
- వ్యక్తిగత స్వార్థం కోసం నేను పని చేయలేదు
ముఖ్యమంత్రి జగన్ మాత్రం నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వీడలేదని అన్నారు. అమరావతి గురించి చాలా గొప్పగా చెప్పుకున్న నేతలు... ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత స్వార్థం కోసం తాను ఎన్నడూ పని చేయలేదని తెలిపారు. పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తాను పార్టీ మారానని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అన్నింటినీ నెరవేర్చుతామని అన్నారు.