1990 నుంచి ఇలా చేస్తూనే ఉన్నా... విరాట్ కోహ్లీ షేర్ చేసిన రెండు ఫోటోలు వైరల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

1990 నుంచి ఇలా చేస్తూనే ఉన్నా... విరాట్ కోహ్లీ షేర్ చేసిన రెండు ఫోటోలు వైరల్!

  • పాక్ తో మ్యాచ్ మధ్యలో విరాట్ పోజు వైరల్
  • నడుముపై చేతులు వేసుకుని ఆకాశంవైపు చూస్తున్న కోహ్లీ
  • అటువంటిదే చిన్నప్పటి ఫొటోను చూపిన భారత కెప్టెన్
రెండు రోజుల క్రితం పాకిస్థాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓ విచిత్రమైన పోజునిస్తూ, వర్షం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆకాశంవైపు చూడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ సమయంలో నడుముపై రెండు చేతులూ పెట్టుకుని, మబ్బులవైపు కోహ్లీ చూస్తున్నట్టు ఉన్నాడు. ఈ ఫొటోపై ఎన్నో కామెంట్లు రాగా, కోహ్లీ మరోసారి స్పందించాడు.

 తాను చిన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నానంటూ మరో ఫొటోను జోడించాడు. 1990లో తన చిన్నప్పుడు నడుముపై చేతులు ఉంచుకుని పోజిచ్చి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ రెండు ఫొటోలూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా, పాక్ పై జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 89 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తరువాతి మ్యాచ్ ని ఇండియా జట్టు శనివారం నాడు ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది.
Virat Kohli
Social Media
Child Hood
Photo
Viral

More Telugu News