అభినందన్‌పై పాక్ యాడ్‌కు కోల్‌కతా పోలీసుల దిమ్మదిరిగే రిప్లై
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభినందన్‌పై పాక్ యాడ్‌కు కోల్‌కతా పోలీసుల దిమ్మదిరిగే రిప్లై

  • ప్రతీసారి నువ్వెలా గెలుస్తున్నావన్న సర్ఫరాజ్
  • అభినందన్ స్టైల్లో సమాధానం ఇచ్చిన 
  • కోహ్లీ
  • కోల్‌కతా పోలీసులపై ప్రశంసల వర్షం
ప్రపంచకప్‌లో భారత్-పాక్ పోరుకు ముందు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పోలిన వ్యక్తితో పాక్ చానల్ ఒకటి రూపొందించిన ఓ యాడ్ హల్‌చల్ చేసింది. దర్యాప్తు అధికారి ముందు చాయ్ తాగుతూ కూర్చున్న అభినందన్ అతడు అడిగే ప్రతీ ప్రశ్నకు ఈ ప్రశ్నకు ‘దీనికి నేను సమాధానం చెప్పకూడదు సర్’ అని వినయంగా చెబుతుంటాడు. ఈ యాడ్‌పై భారత అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభినందన్‌ను అవమానించేలా ఉన్న ఈ యాడ్‌పై మండిపడ్డారు.

ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య పోరులో భారత్ విజయం సాధించింది. ఆ వెంటనే కోల్ కతా పోలీసులు ట్వీట్ చేసిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభినందన్ స్టైల్లోనే పాక్‌కు రిప్లై ఇచ్చింది. ఇందులో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్- టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోలు ఉన్నాయి. భారత్ విజయం సాధించిన అనంతరం కోహ్లీని ఉద్దేశించి సర్ఫరాజ్.. ‘ప్రతీసారి నువ్వెలా గెలుస్తున్నావ్?’ అని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబుగా కోహ్లీ ‘‘ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకూడదు’’ అని బదులిస్తాడు.  ఇది చూసిన నెటిజన్లు కోల్‌కతా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందన్‌ను అవమానించిన పాక్‌కు భలే రిప్లై ఇచ్చారంటూ ప్రశంసిస్తున్నారు.
Virat Kohli
sarfaraj
Pakistan
India
abhinandan

More Telugu News