తెనాలిలో దారుణం... నిలిపివుంచిన ట్రాక్టర్ ను స్టార్ట్ చేసిన చిన్నారులు, అక్కడే ఆడుకుంటున్న చిన్నారి దుర్మరణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెనాలిలో దారుణం... నిలిపివుంచిన ట్రాక్టర్ ను స్టార్ట్ చేసిన చిన్నారులు, అక్కడే ఆడుకుంటున్న చిన్నారి దుర్మరణం

  • గేర్లోనే ఉన్న ట్రాక్టర్
  • ఆడుకుంటూ తాళం తిప్పిన చిన్నారులు
  • ఒక్కసారిగా ముందుకు దూకిన ట్రాక్టర్
గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక అమరావతి కాలనీలో రోడ్డు పక్కన నిలిపివుంచిన ఓ ట్రాక్టర్ ను చిన్నారులు స్టార్ట్ చేయగా, ఆ ట్రాక్టర్ అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పవన్ అనే రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందడం అందరినీ కలచివేసింది.

ఆగివున్న సమయంలో ట్రాక్టర్ గేర్లోనే ఉండగా, ఇంజిన్ తాళం కూడా అక్కడే ఉంది. ఆడుకుంటున్న చిన్నారులు సరదాగా ట్రాక్టర్ ఎక్కి తాళం తిప్పడంతో, అప్పటికే గేర్లో ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూకింది. దాంతో, అక్కడే ఉన్న పవన్ ఆ ట్రాక్టర్ చక్రాల కిందపడి నలిగిపోయినట్టు ప్రత్యక్షసాక్షుల కథనం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బిడ్డను కోల్పోయిన తల్లి రోదనలు అక్కడున్న వారిని కదిలించివేశాయి.
Tenali
Tractor

More Telugu News