కాసేపట్లో జగన్ తో భేటీ కానున్న కేసీఆర్
- విజయవాడ చేరుకున్న కేసీఆర్
- కాసేపట్లో తాడేపల్లిలోని జగన్ నివాసానికి పయనం
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం
కాసేపట్లో తాడేపల్లిలోని జగన్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను ఆహ్వానించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గేట్ వే హోటల్ కు వెళ్లి కాసేపు సేదతీరిన అనంతరం... సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 7.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు.