ప్రధాని ఇమ్రాన్ సూచనలను పెడచెవిన పెట్టిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్
- టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలన్న ఇమ్రాన్
- స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్లతో బరిలోకి దిగాలని సూచన
- పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిన సర్ఫరాజ్
టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ సూచించారు. అలాగే, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించారు. పిచ్ మరీ తేమగా ఉంటే తప్ప టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగే చేయాలని, ఒత్తిడి ఉంటే పార్ట్ టైమర్లు రాణించలేరని పేర్కొన్నారు. అయితే, ఇమ్రాన్ సూచనకు పూర్తి విరుద్ధంగా సర్ఫరాజ్ నిర్ణయం తీసుకున్నాడు. టాస్ గెలవగానే భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. బ్యాటింగ్ పిచ్ అని తెలిసినా సర్ఫరాజ్ బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మాంచెస్టర్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే సర్ఫరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.