వరలక్ష్మి శాపనార్థాలకు హుందాగా బదులిచ్చిన హీరో విశాల్
- వరలక్ష్మి మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు
- ఆమెకు మాట్లాడే హక్కుందన్న విశాల్
- గతంలో స్నేహితులుగా కొనసాగిన విశాల్, వరలక్ష్మి
"వరలక్ష్మి మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా భావిస్తాను. ఏదైనా అంశంపై ఆమెకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరినైనా విమర్శించుకోవచ్చు" అంటూ బదులిచ్చారు. ఒకప్పుడు విశాల్, వరలక్ష్మిల స్నేహబంధం ఎన్నో ఊహాగానాలకు ఊతమిచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ, విశాల్ హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పుకార్లకు అడ్డుకట్ట వేశాడు.