Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రకాశ్ రాజ్ తో సెల్ఫీ దిగిందని భార్యపై రంకెలు వేసిన భర్త

  • సెల్ఫీ డిలీట్ చేయమంటూ భార్యపై ఆగ్రహం
  • కన్నీళ్లు పెట్టుకున్న భార్య
  • భర్తకు క్లాస్ పీకిన ప్రకాశ్ రాజ్
కశ్మీర్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గుల్మార్గ్ లోని తన హోటల్ కు నడుచుకుంటూ వెళుతుండగా, ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ప్రకాశ్ రాజ్ వద్దకు వచ్చారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆపై ఓ సెల్ఫీ కావాలని అడగడంతో ప్రకాశ్ రాజ్ అంగీకరించారు. సెల్ఫీ తీసుకుని పక్కకి వస్తున్న సమయంలో ఆమె భర్త ఎంటరయ్యాడు.

భార్య ముఖంలో సంతోషం చూసి ఒక్కసారిగా రౌద్రరూపం దాల్చాడు. భార్యను పక్కకి లాగి, వెంటనే ఫోన్ లోంచి ఆ సెల్ఫీ డిలీట్ చేయమని రంకెలు వేశాడు. భర్త తీరుతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇంతకీ ఆ వ్యక్తి ప్రకాశ్ రాజ్ తో సెల్ఫీని వ్యతిరేకించడానికి కారణం మోదీపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలేనట! ఈ విషయం అతడి ద్వారానే తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ వెంటనే స్పందించారు.

ఆ మహిళ భర్తను పక్కకి తీసుకెళ్లి ప్రకాశ్ రాజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. "ఏమండీ, మిమ్మల్ని మీ భార్య పెళ్లిచేసుకోవడానికి, మీకు అందమైన కుమార్తెను ఇచ్చి మీతో జీవితం పంచుకోవడానికి నేను, మోదీ ఏ విధంగానూ కారణం కాదు. మోదీపై నేను వ్యాఖ్యలు చేశానని మీరు మీ భార్యను కోప్పడడంలో అర్థంలేదు. వాళ్లు మీ అభిప్రాయాలను ఎలా గౌరవిస్తున్నారో, మీరు కూడా మీ భార్యబిడ్డల అభిప్రాయాలను గౌరవించండి. ఇలాంటి విషయాల కోసం టూర్ ను పాడుచేసుకుంటారా, హాయిగా ఆస్వాదించండి" అంటూ క్లాస్ తీసుకున్నారు. ప్రకాశ్ రాజ్ తన కొత్త చిత్రం షూటింగ్ కోసం కుటుంబంతో కలిసి ప్రస్తుతం కశ్మీర్లో ఉన్నారు.
Prakash Raj
Jammu And Kashmir

More Telugu News