ఆ సినిమాలో సమంత విషయంలో నాగ్ నిర్ణయం ఏమిటో?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమాలో సమంత విషయంలో నాగ్ నిర్ణయం ఏమిటో?

  • నాగార్జున తాజా చిత్రంగా 'మన్మథుడు 2'
  • తదుపరి సినిమాగా 'బంగార్రాజు'
  • నాగ్ కి మనవడి పాత్రలో చైతూ  
ప్రస్తుతం నాగార్జున 'మన్మథుడు 2' సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రొమాంటిక్ హీరోగా ఈ సినిమాలో స్టైలీష్ గా కనిపించే నాగార్జున, ఆ వెంటనే 'బంగార్రాజు' సినిమాలో గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ హీరోగా చేయనున్నారు. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా'కి ఇది సీక్వెల్.

ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ కనిపించనుంది. ఆయన మనవడిగా నాగచైతన్య నటించనున్నాడని అంటున్నారు. ఇక చైతూ జోడీగా సమంతను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొంతమంది నాగ్ దగ్గర వ్యక్తం చేశారట. సమంతను తీసుకోవడం వలన ప్రాజెక్టుపై క్రేజ్ పెరుగుతుందని అంటున్నారట. 'ఓ బేబీ' ఫలితాన్ని బట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో నాగ్ వున్నాడని అంటున్నారు. 
nagarjuna
samanta

More Telugu News