చంద్రబాబు హయాంలో భారీగా అవినీతి జరిగింది.. నా శాఖలో ఇకపై దోపిడీ ఉండదు!: మంత్రి అనిల్ కుమార్
- వైఎస్ ప్రారంభించిన ప్రతీ ప్రాజెక్టును పూర్తిచేస్తాం
- జగన్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారు
- జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనిల్
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో వ్యవసాయశాఖలో భారీ అవినీతి చోటుచేసుకుందనీ, తమ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖలో దోపిడీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతీ టెండర్ ను జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచుతామని పునరుద్ఘాటించారు.