Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏకంగా ధనుశ్ సినిమాకే దర్శకుడిగా ఛాన్స్?

  • 'అ' సినిమాతో ప్రశాంత్ వర్మకి ప్రశంసలు
  •  ఈ నెల 28న రానున్న 'కల్కి'
  • ద్విభాషా చిత్రానికి సన్నాహాలు
'అ' సినిమాతో దర్శకుడైన ప్రశాంత్ వర్మ మంచి మార్కులు కొట్టేశాడు. ఒక విలక్షమైన కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడంటూ అంతా ప్రశంసించారు. ఆయన తాజా చిత్రంగా 'కల్కి' రూపొందింది. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తమిళ హీరో ధనుశ్ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకి లభించినట్టుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవలే ధనుశ్ ను కలిసి ప్రశాంత్ వర్మ ఒక కథ చెప్పడం .. పూర్తి స్క్రిప్టును సిద్ధం చేయమని ధనుశ్ చెప్పడం జరిగిపోయాయట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ధనుశ్ పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుందట. అందువల్లనే వెంటనే ఆయన ఓకే అనేశాడని చెబుతున్నారు.
dhanush
prashanth varma

More Telugu News