భూతవైద్యం పేరుతో యువతిపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఘటన
- ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించిన భూత వైద్యుడు
- బీదర్‌లోని దర్గాకు తీసుకెళ్లి పూజలు
- ఇంటికొచ్చి యువతిపై అత్యాచారం
ఇందులో భాగంగా వారిని రెండుసార్లు బీదర్‌లోని ఓ దర్గాకు తీసుకెళ్లి పూజలు చేశాడు. అనంతరం బాధిత దంపతుల కుమార్తె (19)ను ఓ గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా మాట్లాడాడు. తనను పెళ్లి చేసుకోకుంటే తల్లిదండ్రులు చనిపోతారని యువతిని భయపెట్టాడు. ఈ నెల 11న బోరబండలోని యువతి నివాసానికి వచ్చిన ఆజం యువతిని వేరే గదిలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.