తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఆత్మహత్య

  • జేఈఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సంపత్‌
  • పది రోజులుగా సెలవులో  ఉన్న సంపత్
  • వినాయకనగర్‌ వసతి గృహంలో పంచెతో ఉరి
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీటీడీ జేఈవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న సంపత్‌ (38) ఈరోజు తిరుపతిలోని వినాయకనగర్‌ వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత పది రోజులుగా సెలవులో ఉన్న ఇతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంచెతో ఉరివేసుకుని బలవన్మరణం పొందాడు. సీలింగుకి వేలాడుతున్న ఇతన్ని ఉదయం స్థానికులు గమనించి గది తలుపులు పగుల గొట్టి లోపలికి వ్రవేశించారు. హుటాహుటిన సంపత్‌ను సమీపంలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇతను ఎందుకు  ఆత్మహత్యకు పాల్పడ్డాడో కారణాలు తెలియరాలేదు.
Go Back to Shorts
Crime News
TTD eployee suicide
hanging
tirupathi

More Telugu News