వర్షం తగ్గింది..! మైదానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్న అంపైర్లు

  • ట్రెంట్ బ్రిడ్జ్ లో టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్
  • అడ్డంకిగా మారిన వరుణుడు
  • మరికాసేపట్లో మ్యాచ్ మొదలయ్యే అవకాశం
ట్రెంట్ బ్రిడ్జ్ లో కూడా వరుణుడు నేనున్నానంటూ ప్రత్యక్షం కావడంతో టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి ఆరంభం కాలేదు. ఉదయం నుంచే వర్షం పడుతుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఓ దశలో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు తలెత్తాయి. అయితే వర్షం తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. మైదానంలో అవుట్ ఫీల్డ్ ఆటకు అనువుగా ఉండే పక్షంలో టాస్ వేయనున్నారు. కాగా, ట్రెంట్ బ్రిడ్జ్ మైదానాన్ని మ్యాచ్ నిర్వహణకు వీలుగా తీర్చిదిద్దేందుకు మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోసారి వర్షం వస్తే మ్యాచ్ జరిగే అవకాశాలు అంతంతమాత్రమే అని చెప్పాలి.
Go Back to Shorts
India
New Zealand

More Telugu News