ఇదే అచ్చెన్నాయుడు జగన్ ను ‘నువ్వు మగాడివైతే’ అన్నారు.. వీటికి సమాధానం ఏది అధ్యక్షా?: బుగ్గన రాజేంద్రనాథ్
- టీడీపీ నేతలు ప్రజా సేవకులని చెప్పుకుంటుంటారు
- అదే క్రమంలో చెవిరెడ్డి కూడా బంట్రోతు అని ఉండొచ్చు
- ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన వైసీపీ నేత
ఒకరేమో పూడ్చిపెడతాం అంటాడు. ఇంకొకరు ఏమో పాతిపెడతాం అంటారు. చివరికి అచ్చెన్నాయుడు అయితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను పట్టుకుని ‘నువ్వు మగాడివైతే’ అని దుర్భాషలాడారు. మరి ఈ మాటలకు సమాధానం లేదా అధ్యక్షా? ఈరోజు చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అలాగే ఉంటుంటే న్యాయంగా అనిపించేది. సేవకులు, సైనికులు అని చెప్పుకుని టీడీపీ నేతలు తిరుగుతుంటారు కాబట్టి చెవిరెడ్డి ఓ మాట అని ఉండొచ్చు. దానికే ఈ చిన్న మాటను పట్టుకుని గొడవ చేస్తారా? టీడీపీ నుంచి ప్రతీఒక్కరూ గతంలో ఇష్టానుసారం మాట్లాడారు. ఆ రికార్డులను ఓసారి బయటకు తీయాలి’’ అని బుగ్గన డిమాండ్ చేశారు.