స్పీకర్ ను అవమానించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య: ఏపీ అసెంబ్లీ లో రోజా
- తమ్మినేని స్పీకర్ అయినందుకు అందరూ సంతోషపడాలి
- గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా బాబు అవమానించారు
- అచ్చెన్నాయుడికి కడుపు మంటగా ఉన్నట్టుంది
స్పీకర్ ను అవమానించడంలో గానీ, ఆ చైర్ ను దుర్వినియోగం చేయడం గానీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, గతాన్ని చూసినా ఇప్పుడు చూసినా అర్థమవుతుందని అన్నారు. ఎందుకంటే, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు ఆయన్ని గౌరవించకుండా అవమానించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు. మళ్లీ ఈ రోజున తమ్మినేని స్పీకర్ అయినప్పుడు అలాంటి పరిస్థితినే చూస్తున్నామని, తమకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని ఈ పదవిని దక్కించుకున్నందుకు అందరూ సంతోషపడాలని అన్నారు. ముఖ్యంగా, తమ్మినేని సొంత జిల్లాకు చెందిన వాసులు మరింత సంతోషపడాలి కానీ, అచ్చెన్నాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదని, ఆయన మాటలు చూస్తుంటే సంతోషం కంటే కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్టు కనపడుతోందని అన్నారు.