జూనియర్ ఆర్టిస్ట్ ను మోసం చేసిన సినీ రచయిత రమణ గౌతమ్ అరెస్ట్!
- టాలీవుడ్ లో రచయితగా రమణ గౌతమ్
- సినీ చాన్స్ ల కోసం ప్రయత్నిస్తున్న భవానితో ప్రేమ
- తాళి కట్టి, గంటలోనే ఉడాయించిన ఘనుడు
.
పెళ్లి చేసుకోవాలని కోరితే తప్పించుకు తిరుగుతున్న రమణ గౌతమ్ పై భవాని ఫిర్యాదు చేయగా, భయపడి, అదే రోజు రాత్రి ఓ గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కట్టాడు. ఆపై గంట వ్యవధిలోనే పారిపోయి, తెల్లారి ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భవాని మరోసారి పోలీసులను ఆశ్రయించింది. రమణను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.