ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో మాజీ ముఖ్యమంత్రి భేటీ
- కేజ్రీ నివాసానికి వెళ్లిన షీలా దీక్షిత్
- రాజధానిలోని సమస్యలపై చర్చ
- కరెంటు, నీటి సమస్యలపై చర్చ
గత శనివారం కేజ్రీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన షీలా దీక్షిత్ కరెంట్ సమస్యలు తీర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందంటూ విరుచుకు పడ్డారు. అయితే నేటి భేటీలో షీలా ముఖ్యంగా కరెంటు, నీటి సమస్యలపైనే చర్చించారు. వచ్చే ఆరు నెలల కాలానికి ప్రజల కరెంటు బిల్లులను మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోపక్క, ఎనిమిది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.