కలిసొచ్చిన అదృష్టం... లండన్ బయలుదేరనున్న రిషబ్ పంత్!
- నెలన్నర క్రితం చోటు దక్కించుకోలేక పోయిన పంత్
- ధావన్ గాయపడటంతో రిషబ్ కు పిలుపు
- ఒకటి లేదా రెండు రోజుల్లో జట్టులో చేరిక
ఈ మేరకు అధికారుల నుంచి పిలుపును అందుకున్న రిషబ్, లండన్ కు బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా లండన్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్న సమాచారం తనకు అందిందని రిషబ్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ లో ఉన్న బీసీసీఐ అధికారి ఒకరు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ధావన్ స్థానంలో రిషబ్ రానున్నాడని తెలిపారు.