40 వేల ఏళ్ల నాడు రాకాసి తోడేలు ఇలా... ఇప్పటికీ చెక్కు చెదరని తల లభ్యం!

  • సైబీరియాలో శాస్త్రవేత్తలకు లభ్యం
  • 16 అంగుళాల పొడవున్న తల
  • సింహం బలంతో పోల్చి చూస్తామన్న సైంటిస్టులు
దాదాపు 40 వేల సంవత్సరాల నాటి రాకాసి తోడేలు తల ఇప్పటికీ చెక్కు చెదరకుండా లభ్యంకావడం సైబీరియాలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. మెదడుతో సహా తోడేలు తల, ఇతర భాగాలు పాడవకుండా ఉండటం గమనార్హం. ఈ తోడేలు తల ప్రస్తుతం కనిపించే తోడేళ్ల తల కన్నా చాలా పెద్దదిగా ఉండటం గమనార్హం. సాధారణ తోడేళ్ల తల 9 అంగుళాల వరకూ పొడవు ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలకు లభ్యమైన ఈ రాకాసి తోడేలు తల ఏకంగా 16 అంగుళాల పొడువు ఉండటం గమనార్హం.

సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో ఇది రష్యన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అల్బర్ట్‌ ప్రోటోపోపోవ్‌ బృందానికి లభ్యమైంది. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తల లభ్యంకావడం ఆధునిక మానవ చరిత్రలో ఇదే తొలిసారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాకాసి తోడేలు తల, కండరాలు, మెదడు బాగానే ఉన్నాయని, ప్రస్తుత తోడేళ్ల జాతితో పాటు, సింహాలతో దీన్ని పోల్చి చూస్తామని టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కు ప్రొఫెసర్‌ నావోకీ సుజుకి వెల్లడించారు.
Go Back to Shorts
Wolf
Syberia
Scientists

More Telugu News