ఎన్నో మధురస్మృతులను ఇచ్చావు పాజీ... యువీ రిటైర్మెంట్ పై కోహ్లీ స్పందన
- యువీ ఓ తిరుగులేని చాంపియన్
- అద్భుతమైన కెరీర్ తో దేశానికి సేవలందించాడు
- యువీ జీవితం ఆనందమయంగా సాగిపోవాలి
యువీ రిటైర్ అవుతున్నట్టు తెలియగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "ఎన్నో చిరస్మరణీయ విజయాలు, మరెన్నో మధురస్మృతులను మాకందించావు పాజీ! అద్భుతమైన కెరీర్ తో దేశానికి సేవలు అందించావు, నీకు శుభాభినందనలు. నీ జీవితం ఆనందమయంగా సాగిపోవాలంటూ కోరుకుంటున్నాను. నువ్వు తిరుగులేని చాంపియన్ యువీ" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.