మెట్రో స్టేషన్ సమీపంలో దారుణం.. సైకిల్ స్టాండ్ వద్ద ఓ డబ్బాలో తలలేని మహిళ మృతదేహం లభ్యం!

ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌కి సమీపంలో ఉన్న సైకిల్ స్టాండ్ వద్ద దారుణం వెలుగు చూసింది. వాయువ్య ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం అనుమానాస్పదంగా ఓ డబ్బా కనిపించడంతో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బాను తెరిచి చూడగా తల లేకుండా ఉన్న మహిళ మృతదేహం కనిపించింది.

ఈ విషయమై వాయువ్య ఢిల్లీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు భిషం సింగ్ మాట్లాడుతూ, డబ్బా నుంచి నీళ్లు కారుతున్నాయని, రెండు - మూడు రోజుల క్రితమే హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. వాసన వెలువడుతుండటంతో ఓ వ్యక్తి సమాచారమందించారని తెలిపారు. సైకిల్ స్టాండ్ గోడకు ఆనించి డబ్బాను పెట్టారని, మహిళను ఒక్క గుడ్డలో చుట్టి పెట్టారని, ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలూ లభ్యం కాలేదని భిషం సింగ్ పేర్కొన్నారు. మృతురాలు ఎవరనే విషయమై విచారణ నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Delhi
Metro Station
Police
Bhisham Singh
Cycle Stand

More Telugu News