కెనడా మాజీ ప్రధాని ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ చెట్టాపట్టాల్

Justin Trudeau and Katy Perry Dating Rumors Spark Again
  • కాలిఫోర్నియాలో జరిగిన సంగీత వేడుకలో పాల్గొన్న ట్రూడో, కేటీ పెర్రీ
  • ట్రూడోతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న పెర్రీ
  • దాదాపు సంవత్సర కాలంగా డేటింగ్‌లో ఉన్న ట్రూడో, కేటీ పెర్రీ
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జంట కాలిఫోర్నియాలో జరిగిన ఒక సంగీత వేడుకలో కలిసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కేటీ పెర్రీ సోషల్ మీడియాలో పంచుకుంది. చేతిలో చేయి వేసి నడవడం, కూర్చుని డ్రింక్స్ తాగడం వంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

దాదాపు పదేళ్ల పాటు కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో, గత సంవత్సరం ప్రారంభంలో రాజీనామా చేశారు. ఈ క్రమంలో గత సంవత్సరం జూలైలో వీరిద్దరు మాంట్రియాల్‌లోని ఒక రెస్టారెంటులో కనిపించారు. వీరు డేటింగ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత విలాసవంతమైన నౌకపై వీరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.

డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ వీరిద్దరు మాత్రం స్పందించలేదు. కానీ తరచూ వీరిద్దరు కలిసి దర్శనమిస్తున్నారు. ట్రూడో తన భార్య సోఫీ గ్రెగోరీకి 2023లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నటుడు ఓర్లాండో బూమ్‌తో ఏడేళ్లుగా కలిసి ఉంటున్న కేటీ పెర్రీ గత సంవత్సరం అతనితో విడిపోయారు.
Advertisement
Justin Trudeau
Justin Trudeau Katy Perry
Katy Perry
Canada Prime Minister
Pop Star Dating
Celebrity Dating

More Telugu News