ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్, సీఎం జగన్
- బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని
- అనంతరం తిరుమల వెళ్లనున్న మోదీ
- సాయంత్రం 6.15 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనం
అనంతరం, రేణిగుంట ఎయిర్ పోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరుమలకు మోదీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు తిరుమల శ్రీవారిని సందర్శించుకోనున్నారు. అనంతరం, రాత్రి 8.15 గంటలకు తిరిగి ఢిల్లీకి మోదీ బయలుదేరి వెళతారని సమాచారం.