ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆలోచన విరమణ!
- సీఎం జగన్ నుంచి సానుకూల సంకేతాలు
- ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీ
- సమ్మె నోటీసును వెనక్కు తీసుకున్న కార్మిక సంఘాలు
ఈ నెల 10న వచ్చి కలవాలని సీఎం నుంచి సమాచారం అందిందని, ఆ సమావేశంలో కార్మికుల సమస్యలను వివరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సమ్మె సన్నాహక సభలను కూడా రద్దు చేశామని అన్నారు. కాగా, గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, రిటైర్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీని వేయనున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సివుంటుంది. దీని ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు తయారవుతాయి.