మంత్రులకు ఇన్నోవా కార్లను కేటాయించిన ఏపీ ప్రభుత్వం!
- ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు
- ఇన్నోవా కార్లను ఇచ్చిన ప్రభుత్వం
- ఈరోజు సాయంత్రం మంత్రిత్వశాఖల కేటాయింపు
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి కొత్తగా ఇన్నోవా కార్లను కేటాయించింది. ఈ 25 మంది మంత్రులకు జగన్ ఏయే బాధ్యతలు అప్పగించబోతున్నారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సాయంత్రం నాటికి సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకేసారి ఏడుగురు సభ్యులు ప్రయాణించగల టయోటా ఇన్నోవా కార్ల ప్రారంభ ధర మార్కెట్ లో రూ.14.93 లక్షల నుంచి రూ.23.24 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మార్కెట్ లో లభ్యమవుతోంది.