ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు!
- ఏపీ సీఎం, నూతన కేబినెట్ కు శుభాకాంక్షలు
- జగన్ నిర్ణయం సామాజిక విప్లవానికి నాంది
- బీసీలు, ఎస్సీ,ఎస్టీలకు పెద్దపీట వేశారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఎవరూ ఊహించని విధంగా 8 మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా నేను భావిస్తున్నాను.
పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవిని బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవిని బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం’ అని కృష్ణంరాజు ప్రశంసించారు. పిన్నవయసులోనే ప్రజానేతగా ఎదిగిన జగన్.. రాజకీయాల్లో రియల్ హీరోగా నిలిచారని కితాబిచ్చారు. జగన్ నేతృత్వంలోని మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.