ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన ఎస్సై.. కొనప్రాణంతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు!
- హోంగార్డుతో బాధితుడికి భూవివాదం
- రంగంలోకి దిగిన ఎస్సై.. స్టేషన్ కు పిలిపించి చావబాదుడు
- ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
ఈ క్రమంలో నిన్న ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మార్కాపురం ఎస్సై ఆంజనేయులు చెన్నకేశవులను స్టేషన్ కు పిలిపించాడు. అనంతరం అతను చెప్పేది వినకుండా లాఠీతో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దాడిలో చెన్నకేశవులు తీవ్రంగా గాయపడటంతో అతడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఇంతవరకూ స్పందించలేదు.