విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కైరా అద్వాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కైరా అద్వాని

  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కైరా అద్వాని
  • తెలుగు .. తమిళ భాషల్లోను క్రేజ్ 
  • శివకార్తికేయన్ జోడీగా ఛాన్స్    
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన కైరా అద్వాని, వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు .. తమిళ భాషల్లోను యూత్ హృదయాలను కొల్లగొట్టేయడానికి ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.

తెలుగులో 'వినయ విధేయ రామ' సినిమాలో గ్లామర్ పరంగా కుర్రకారు మతులు పోగొట్టిన కైరా అద్వాని, తమిళంలోనూ తన జోరు చూపించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తమిళంలో ఒక ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. నయనతార ప్రేమికుడు విఘ్నేశ్ శివన్ తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించవలసి వుంది. 
kiara adwani

More Telugu News