పోలీసులకు వీక్లీ ఆఫ్.. పరిశీలనకు అధికారులతో కమిటీని నియమించిన సీఎం జగన్!

  • వారానికి ఓరోజు సెలవిస్తామన్న జగన్
  • ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు
  • కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులకు వారానికి ఓరోజు సెలవు ఇస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు.

ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ అనంతరం వీక్లీ ఆఫ్ పై అధ్యయనం కోసం ముఖ్యమంత్రి ఓ కమిటీని నియమించారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యంగార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Police
weekly off
21 officers

More Telugu News