Andhra Pradesh: వివేకా హత్యకేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితులకు జూన్ 17 వరకు రిమాండ్ పొడిగించారు. వివేకాను ఆసుపత్రికి తరలించే సమయంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగాల మీద అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని పలు దఫాలుగా కోర్టులో హాజరుపర్చగా జూన్ 3వరకు రిమాండ్ విధించారు.  ఆ రిమాండ్ ముగియడంతో, మరోసారి న్యాయస్థానం ముందుకు తీసుకురాగా, ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అనంతరం వీరిని పులివెందుల సబ్ జైలుకు తరలించారు.
Andhra Pradesh

More Telugu News