సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రూటు మార్చిన ఆదాశర్మ
- 'బిగ్ బాస్ 3' హోస్ట్ ఆయనే!
- 'టైగర్ నాగేశ్వరరావు' అప్ డేట్
* 'బిగ్ బాస్ 3' తెలుగు టీవీ షోకి హోస్ట్ గా గత కొంత కాలంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగార్జునతో సదరు నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.
* తాజాగా 'సీత' సినిమాలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో గజదొంగ పాత్రను పోషించనున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి జరుగుతుంది.