ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బ్యాట్లకు పనిచెప్పిన పాకిస్థాన్ టాపార్డర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బ్యాట్లకు పనిచెప్పిన పాకిస్థాన్ టాపార్డర్

  • భారీస్కోరు దిశగా పాకిస్థాన్
  • బాబర్, హఫీజ్ అర్ధసెంచరీలు
  • నాటింగ్ హామ్ వేదికగా మ్యాచ్
వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో కంగుతిన్న పాకిస్థాన్ జట్టు ఇవాళ ఇంగ్లాండ్ పై బ్యాట్లు ఝుళిపిస్తోంది. నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు టాపార్డర్ అండగా నిలిచింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ నుంచి కెప్టెన్ సర్ఫరాజ్ నవాజ్ వరకు అందరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టును భారీస్కోరు దిశగా నడిపించారు.

ఓపెనర్లు ఇమాముల్ హక్ (44), ఫఖార్ జమాన్ (36) తొలి వికెట్ కు 82 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత బాబర్ అజామ్ 63, మహ్మద్ హఫీజ్ 84 పరుగులు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.
Cricket

More Telugu News