ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయలేను: సల్మాన్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయలేను: సల్మాన్ ఖాన్

  • అలాంటి సీన్లు నాకు అసౌకర్యంగా ఉంటాయి
  • ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతుంటారు
  • ఇప్పుడు ట్రెండ్ మారింది.. అయినా చేయలేను
బాలీవుడ్ లో రొమాన్స్ డోసు కొంచెం ఎక్కువగానే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సల్మాన్ ఖాన్ మాత్రం వీటికి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. ఇదే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు తనకు చాలా అసౌకర్యంగా ఉంటాయని చెప్పాడు. తెరపై ముద్దు సన్నివేశాలు వచ్చినప్పుడు కొందరు తల తిప్పుకుంటారని... అది ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు ట్రెండ్ మారిందని... ముద్దు సీన్లను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్నారని... అయినప్పటికీ, తాను అలాంటి సీన్లలో నటించలేనని చెప్పాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించమని కొందరు దర్శకులు తనను అడిగారని... తాను ఒప్పుకోలేదని తెలిపాడు.
salman khan
kiss
romance
bollywood

More Telugu News