విద్యాశాఖ అధికారులతో జగన్ సమీక్ష రద్దు...ఈరోజుకి వైద్య శాఖకే పరిమితం
- ఎప్పుడు జరిగేది తర్వాత తెలియజేస్తామన్న సీఎం
- క్యాంపు కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిన అధికారులు
- వైద్య శాఖ అధికారులతో కొనసాగుతున్న సమీక్ష
ముందస్తు సమాచారం మేరకు ఎప్పటి లాగే తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన విద్యాశాఖ అధికారులు సమీక్ష రద్దయిందని, ఎప్పుడు జరిగేది తర్వాత తెలియజేస్తామని చెప్పడంతో వెనుదిరిగారు. కాగా, వైద్య శాఖ అధికారులతో జగన్ తన కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పలు అంశాలపై అధికారులకు ప్రశ్నలు వేస్తూ నిశితంగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.