మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధాకు రూ. లక్ష టోకరా వేసిన ఘనులు!
- లోధా స్నేహితుని ఈ-మెయిల్ హ్యాక్
- సోదరుడి చికిత్సకు డబ్బు కావాలని మెసేజ్
- నమ్మేసి డబ్బులు వేసిన లోధా
ఏప్రిల్ 19న తనకు బీపీ సింగ్ ఐడీ నుంచి ఓ మెయిల్ వచ్చిందని, తన సోదరుడి చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలన్నది దానిలోని సారాంశమని చెప్పారు. డబ్బిచ్చే విషయంలో ఫోన్ చేయగా, ఆయన లిఫ్ట్ చేయలేదని, దీంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నారని భావించి, వెంటనే ఆయన కోరిన లక్ష రూపాయలను ఆన్ లైన్ ద్వారా రెండు విడతల్లో పంపించానని జస్టిస్ లోధా తన ఫిర్యాదులో వెల్లడించారు.
తన ఈ-మెయిల్ ఎకౌంట్ హ్యాక్ అయిందని, దాన్నుంచి లోధాకు మెసేజ్ వెళ్లగా ఆయన నష్టపోయారని గుర్తించిన బీపీ సింగ్, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో జస్టిస్ లోధా ఫిర్యాదు చేయగా, చీటింగ్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.