Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయన అన్నీ నేర్పారు కానీ డబ్బులు సంపాదించడం మాత్రం నేర్పలేదు: జేడీ చక్రవర్తి

  • డబ్బు కోసం సినిమాలు చేయను
  • ఉత్సాహం కలిగించే పాత్ర అయితేనే సినిమా ఒప్పుకుంటా
  • హిప్పీ ప్రమోషన్ ఈవెంట్లో జేడీ
శివ చిత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు జేడీ చక్రవర్తి. శివ సినిమాలో నెగెటివ్ ఛాయలున్న పాత్ర అయినా జేడీకి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో హీరోగానూ నటించి, కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత జేడీ చక్రవర్తి సినిమాల్లో నటించడం చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా హిప్పీ చిత్రంతో మరోసారి తెరపై కనిపించనున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న జేడీ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ, తాను డబ్బుల కోసం సినిమాలు చేయనని స్పష్టం చేశారు. తమ గురువు రామ్ గోపాల్ వర్మ అన్నీ నేర్పినా డబ్బులు సంపాదించడం మాత్రం నేర్పలేదని చమత్కరించారు. తనలో ఉత్సాహం నింపే పాత్ర అయితేనే సినిమా అంగీకరిస్తానని జేడీ స్పష్టం చేశారు. హిప్పీ కథ విన్న తర్వాత తన పాత్రపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. హిప్పీ చిత్రంలో ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్నాడు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశి, జజ్బా సింగ్ కథానాయికలు. హిప్పీ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Tollywood
Hippi
JD

More Telugu News