భారత్ పై ట్రంప్ కోలులోలేని వాణిజ్య దెబ్బ... రూ. 39 వేల కోట్ల రాయితీ రద్దు!
- ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు
- 5వ తేదీ నుంచి అమలులోకి నిర్ణయం
- ఇక వాణిజ్య రాయితీలు లేనట్టే
అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం చాలా సంవత్సరాల నుంచి జీఎస్పీని అమెరికా అమలు చేస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి పన్నులనూ విధించకుండా పలు రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇక ఇండియా ఆర్థికంగా శరవేగంగా ఎదుగుతున్న వేళ, ఇక్కడ కూడా తమ ఉత్పత్తులను అదే తరహా ప్రోత్సాహాన్ని అమెరికా కోరుతోంది. అమెరికన్ ప్రొడక్టులను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు భారత్ ససేమిరా అంటున్న నేపథ్యంలో, "తన మార్కెట్లో అమెరికాకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పి స్తామని ఇండియా హామీ ఇవ్వదని నేను నిర్ధారణకు వచ్చాను. అందువల్ల భారత్ కు గతంలో కల్పించిన జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ నిర్ణయంపై స్సందించిన భారత్, హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎస్పీ హోదా కింద భారత్ దాదాపు 2 వేలకు పైగా ప్రొడక్టులను అమెరికాకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఎగుమతి చేసేది.