ఇది కూడా తక్కువ స్కోరు మ్యాచే... లంక 136 ఆలౌట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇది కూడా తక్కువ స్కోరు మ్యాచే... లంక 136 ఆలౌట్

  • కార్డిఫ్ లో నిప్పులు చెరిగిన న్యూజిలాండ్ పేసర్లు
  • చేతులెత్తేసిన లంక బ్యాట్స్ మెన్
  • సారథి ఒంటరిపోరు
వరల్డ్ కప్ లో భారీస్కోర్లు నమోదవుతాయని ఆశిస్తున్న ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తూ న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య కార్డిఫ్ మ్యాచ్ కూడా లో స్కోరింగ్ పోటీగా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 29.2 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కెప్టెన్ కరుణరత్నే (52 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఆ జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. పిచ్ పై పచ్చికను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్ చెరో 3 వికెట్లతో లంకేయుల పనిబట్టారు. లంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరెరా 29, తిస్సర పెరెరా 27 పరుగులు చేశారు.
Cricket

More Telugu News