Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కివీస్ పేసర్ల ధాటికి శ్రీలంక విలవిల

  • 60 పరుగులకే 6 వికెట్లు
  • చెలరేగిన హెన్రీ, ఫెర్గుసన్
  • ఆపసోపాలు పడుతున్న లంకేయులు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ కార్డిఫ్ లో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వింగ్, బౌన్స్ కు అనుకూలిస్తున్న పిచ్ పై బ్యాటింగ్ కు దిగిన లంకకు ఏదీ కలిసి రాలేదు. ఓవైపు హెన్రీ, మరోవైపు లాకీ ఫెర్గుసన్ నిప్పులు చెరిగే బంతులతో లంకేయులకు పరీక్ష పెట్టారు. పచ్చికతో కూడిన పిచ్ ను అర్థం చేసుకుని క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడంతో క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి.

ఓ దశలో 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంకను తిస్సర పెరెరా, కెప్టెన్ కరుణరత్నే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 3 వికెట్లు, ఫెర్గుసన్ 2 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 18 ఓవర్లలో 6 వికెట్లకు 82 పరుగులు.
Cricket

More Telugu News