ఓ సహాయమంత్రి నోట ఇలాంటి వ్యాఖ్యలా?... కిషన్ రెడ్డిపై ఒవైసీ ఆగ్రహం
- హైదరాబాద్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఘాటుగా స్పందించిన ఒవైసీ
- కిషన్ రెడ్డిపై విమర్శలు!
"ముస్లింలను చూస్తే చాలు టెర్రరిస్టులంటూ తీసుకెళుతున్నారు. వీళ్లను మార్చలేం!" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. " నేనా సహాయమంత్రిని ఒకటే అడుగుతున్నాను, ఈ ఐదేళ్లలో ఎన్ఐఏ, ఐబీ, రా అధికారులు ఎన్నిసార్లు హైదరాబాద్ ను ఉగ్రవాదుల అడ్డా అని పేర్కొన్నారు? అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత దురదృష్టకరం. హైదరాబాద్ ఎదగడం వీళ్లకు ఇష్టంలేనట్టుంది" అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందు, కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, బెంగళూరు, భోపాల్ ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉంటున్నాయన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రతి రెండుమూడు నెలలకోసారైనా హైదరాబాదులో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు.