ఇక్కడ ఆర్టిస్టులే లేనట్టుగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు: నటి రాధా ప్రశాంతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక్కడ ఆర్టిస్టులే లేనట్టుగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు: నటి రాధా ప్రశాంతి

  • చిత్రపరిశ్రమలో ఒకప్పటి పరిస్థితులు వేరు
  • ఇక్కడి ఆర్టిస్టులను పట్టించుకోవడం లేదు
  • బిజినెస్ పేరుతో పక్కన పెట్టేస్తున్నారు
తాజా ఇంటర్వ్యూలో నటి రాధా ప్రశాంతి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండస్ట్రీలోని పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. "నేను చిత్ర పరిశ్రమకి వచ్చిన తరువాత కొన్నిటికి కాంప్రమైజ్ అయితే అవకాశం ఇవ్వడం .. లేదంటే తీసేయడం చూశాను. మణిరత్నం .. బాలచందర్ .. బాలు మహేంద్ర వంటి దర్శకులు పాత్రకి తగిన నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అవసరమనుకుంటే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు.

అక్క .. చెల్లి .. వదిన .. అమ్మ పాత్రలు చేయడానికి ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు వున్నారు. అయినా ఆ పాత్రలకి వేరే రాష్ట్రాల వారిని తీసుకుంటున్నారు. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన తెలుగు వాళ్లు ఏమైపోవాలనేది దర్శక నిర్మాతలుగానీ .. కొంతమంది హీరోలుగాని  ఆలోచించడం లేదు. బిజినెస్ పేరుతో ఇక్కడి వాళ్లను పక్కన పెట్టేయడం బాధాకరం" అని అన్నారు.
radha prashanthi

More Telugu News