పాకిస్థాన్ టాపార్డర్ కుదేల్... చెలరేగిన విండీస్ బౌలర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ టాపార్డర్ కుదేల్... చెలరేగిన విండీస్ బౌలర్లు

  • 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్
  • రస్సెల్, హోల్డర్, థామస్ కు తలో 2 వికెట్లు
  • టాస్ గెలిచిన విండీస్
వెస్టిండీస్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో తడబాటుకు గురైంది. 17.3 ఓవర్లలో 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. రస్సెల్, కాట్రెల్, హోల్డర్, థామస్ ధాటికి పాక్ టాపార్డర్ మొత్తం పెవిలియన్ చేరింది. పాకిస్థాన్ బ్యాట్స్ మన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకపోవడంతో కనీసం వంద పరుగులు కూడా రాకముందే పాకిస్థాన్ సగం వికెట్లు చేజార్చుకుంది. ఫఖార్ జమాన్ 22, బాబర్ అజామ్ 22 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ హఫీజ్, హసన్ అలీ ఉన్నారు.
Cricket

More Telugu News