చాలా పాత్రలు నా వరకూ వచ్చి వెళ్లిపోయాయి: నటి నీరజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా పాత్రలు నా వరకూ వచ్చి వెళ్లిపోయాయి: నటి నీరజ

  • నాకు ఇచ్చిన పాత్రపై దృష్టి పెడతాను
  •  ఇతర విషయాలు పట్టించుకోను
  • అలాంటప్పుడు బాధపడతాను 
బుల్లితెరపై నటిగా నీరజ మంచి మార్కులను కొట్టేశారు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆమె ఇట్టే ఆకట్టుకుంటారు. అలాంటి నీరజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు.

"నేను సెట్లోకి అడుగు పెట్టింది మొదలు నాకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను. ఇతర విషయాలపై దృష్టి పెట్టను. జలస్ తో కొంతమంది కొన్ని చేస్తుంటారు .. వాటిని పట్టించుకోను. ఇక కొన్ని పాత్రలు నా వరకూ వచ్చి వేరే వాళ్లకు వెళ్లిన సందర్భాలు చాలానే వున్నాయి. సహజంగానే అప్పుడు కాస్త బాధగా అనిపిస్తుంది. నాకు రాసి పెట్టుంటే నేనే చేసే దానిని కదా అనుకుని సరిపెట్టుకుంటానంతే" అని చెప్పుకొచ్చారు.
neeraja

More Telugu News