Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను చెబుతున్నా... జగన్ తండ్రికంటే గొప్పవాడు అవుతాడు: మోహన్ బాబు

  • ట్వీట్ చేసిన మోహన్ బాబు
  • జగన్ కు శుభాభినందనలు
  • మరిన్ని పర్యాయాలు జగనే సీఎం అవుతాడంటూ వ్యాఖ్య
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ పై అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా, సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. "జగన్ కు తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. జగన్ తన తండ్రి వైఎస్సార్ ను మించి గొప్పవాడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని పర్యాయాలు జగనే సీఎంగా ఉంటాడు" అంటూ ట్వీట్ చేశారు.
Mohan Babu
Jagan

More Telugu News