మోదీ ప్రమాణ స్వీకారానికి కాజల్ అగర్వాల్ కు ఆహ్వానం... సారీ చెప్పిన హీరోయిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ ప్రమాణ స్వీకారానికి కాజల్ అగర్వాల్ కు ఆహ్వానం... సారీ చెప్పిన హీరోయిన్

  • సకాలంలో వెళ్లలేక నిస్సహాయత వ్యక్తం చేసిన కాజల్
  • ట్వీట్ లో వివరణ
  • కార్యక్రమాన్ని మిస్సవుతున్నందుకు విచారం
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంతో నరేంద్ర మోదీ రెండో పర్యాయం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో మోదీ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పీఎంవో నుంచి వివిధరంగాల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇన్విటేషన్ అందుకున్నవారిలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. అయితే, మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే విషయంలో ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.

ఢిల్లీకి సకాలంలో చేరుకోలేని పరిస్థితిలో ఉన్నానని, అందుకే రాలేకపోతున్నానని కాజల్ ట్వీట్ చేశారు. "ప్రియమైన మోదీ గారూ, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ, మీ ప్రమాణస్వీకారం సమయానికి నేను చేరుకోలేకపోవచ్చు. అందుకే హాజరు కావడంలేదు. క్షమించండి. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడలేనందుకు ఎంతో బాధగా ఉంది. అయితే మీరు చరిత్ర సృష్టించే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"  అంటూ ట్వీట్ చేశారు.
Kajal Agarwal
Narendra Modi

More Telugu News