Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రారంభమైన క్రికెట్ వరల్డ్ కప్... టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

  • ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • ఓవల్ వేదికగా మ్యాచ్
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ ఆరంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓవల్ మైదానం ఈ ఆసక్తికర మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో మొదటి మ్యాచ్ కావడంతో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరుజట్లు ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టులో బట్లర్, రాయ్, రూట్, మోర్గాన్ వంటి హేమాహేమీలు ఉండగా, దక్షిణాఫ్రికా కూడా డుప్లెసిస్, ఆమ్లా, డికాక్, రబాడా, ఎంగిడి వంటి మ్యాచ్ విన్నర్లతో పటిష్టంగా ఉంది.
Cricket

More Telugu News