Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికం విషయంలో డిమాండ్ చేయను: నటి భావన

  • సీరియల్స్ లో చేయడమే ఇష్టం 
  • దర్శక నిర్మాతలను టెన్షన్ పెట్టను
  •  నా పారితోషికం తక్కువే   
అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై నటిగా భావనకి మంచి క్రేజ్ వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "నేను సినిమాలు చేసినప్పటికీ టీవీ సీరియల్స్ అంటేనే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తాను. ఎందుకంటే నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టినవి సీరియల్సే. సీనియర్ ఆర్టిస్ట్ ను కనుక, నేను పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటానని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికీ నేను తీసుకునే పారితోషికం తక్కువే.

అలాగే కొంతమంది ఆర్టిస్టుల మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే చేస్తానని కూడా నేను షరతులు పెట్టను. ఎందుకంటే దర్శక నిర్మాతల టెన్షన్స్ ను చాలాకాలంగా చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నాను. అందువలన వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నా వలన తోటి నటీనటులు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చింది.
bhavana

More Telugu News